Papua New Guinea: పపువా న్యూ గినియాలో విరిగి పడుతున్న కొండ చరియలు, మట్టిలో కూరుకుపోయి 670 మంది మృతి

Papua New Guinea Landslide Death Toll: పపువా న్యూ గినియాలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటి వరకూ 670 మంది మట్టిలో కూరుకుపోయిన మృతి చెందినట్టు International Organisation for Migration వెల్లడించింది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబలి విలేజ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150 ఇళ్లు ధ్వంసయ్యాయని లెక్క తేలింది. అంతకు ముందు 60 ఇళ్లు ఇలాగే మట్టిలో కూరుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఆధారంగానే కనీసం 670 మంది మట్టిలో కూరుకుపోయిన చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం ఐదుగురి (Papua New Guinea landslide) మృతదేహాలు మాత్రమే దొరికాయి. మరో వ్యక్తి కాలు మాత్రమే కనిపించింది. ఇవన్నీ చూసి ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఎక్కడికక్కడ మట్టి పోగవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్స్‌కి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే..మిగతా దేశాల నుంచి మద్దతు తీసుకోవాలా లేదా అనే సందిగ్ధంలో ఉంది. ఒక్కో చోట 20-26 అడుగుల లోతులో కూరుకుపోయిన బాధితులను చాలా శ్రమ పడి కాపాడే ప్రయత్నాలు చేస్తోంది రెస్క్యూ టీమ్. ప్రభుత్వం పలు చోట్ల సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. రోడ్లపైన పెద్ద ఎత్తున మట్టి ఉండడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

UN fears 670 people buried under Papua landslide



About 670 people are estimated to be buried under a massive landslide in Papua New Guinea, a UN official says.



The head of the International Organization for Migration in Papua New Guinea, Serhan Aktoprak, said the impact of… pic.twitter.com/Hs5UUXYgn9