
Hardik-Natasha: ఫిట్నెస్ ట్రైనర్తో కాఫీ డేట్ కి నటాషా.. అప్పుడే మొదలెట్టేసిందిగా?
Hardik-Natasha : ముంబై ఇండియన్స్ కెప్టెన్ , హార్డిక్ పాండ్యా, నటి నటాషా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటాషా ఇన్‌స్టా ఖాతాలో పాండ్యా పేరును డిలిట్ చేయడం, అలాగే నటాషా బర్త్ డేకు పాండ్యా విష్ చేయకపోవడం, అంతే కాదు ఆమె ఐపీఎల్ మ్యాచ్ లకు రాకపోవడం ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది.
అయితే హార్దిక్ పాండ్యాతో విడిపోతున్నట్టు వస్తున్న వార్తల నేపధ్యంలో మోడల్ నటాషా స్టాంకోవిక్ తొలిసారి బయట కనిపించింది. శనివారం ఆమె స్నేహితుడు, బాలీవుడ్ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకొనే అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో కలిసి ఓ కాఫీ షాప్కి వచ్చింది. బాలీవుడ్ నటి దిశాపటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పే అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో మీడియా కంటబడిన నటాషా.. పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా నవ్వేసి ‘థ్యాంక్యూ’ అని వెళ్లిపోయింది. విడాకుల వార్తలపై నటాషా వ్యతిరేకంగా స్పందించకుండా ఇలా నర్మగర్భ సమాధానం చెప్పడంతో విడాకులపై క్లారిటీ వచ్చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Hardik Pandya's wife Natasha's reaction when reporter questions her on the Divorce rumours.pic.twitter.com/wHy7MLTEWm